Saturday, November 8, 2014

నీ చెలిమి నేడే కోరితినీ

చిత్రం :  ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  నార్ల చిరంజీవి
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి... 

పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి

చరణం 1 :

మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి

చరణం 2 :

చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి

1 comments:

Unknown said...

Nice song by సాలూరి వారు and equally nice performance by తెల్ల కోయిలమ్మ.

Post a Comment