Wednesday, November 12, 2014

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన

చిత్రం : సప్తపది
సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్
గానం:- జానక, బాలు

పల్లవి
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

చరణం
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టద
ఏమో
తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్న
గోపెమ్మ ఈడున్న
గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన

చరణం
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
పాపం
అల్లనమోవికి తాకితే గేయాలు
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా
ఆ కలిమి చూసేనా

0 comments:

Post a Comment