Saturday, November 8, 2014

నా హృదయంలో నిదురించే చెలి.. కలలలోనే కవ్వించే సఖి

చిత్రం :  ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే

నా హృదయంలో నిదురించే చెలి

చరణం 1 :

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి అనుసరించినానే..  కలవరించినానే

నా హృదయంలో నిదురించే చెలీ

చరణం 2 :

నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే ..
ప్రాణముగా పులకరించినావే.. పల్లవిగా పలుకరించ రావే..
పల్లవిగా పలుకరించ రావే


నీ వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే.. నిదురకాచినానే

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి

0 comments:

Post a Comment