Wednesday, December 10, 2014

పగలే వెన్నెల జగమే ఊయల



చిత్రం :-  పూజాఫలం 

గాయకులూ :-  యస్. జానకి


సంగీతం:-  సాలూరి రాజేశ్వరరావు


రచయిత:- డా.సి.నారయణ రెడ్డి



పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచె
నీటిలోన కలువభామ పొంగి పూచె..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసె
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల
Read more

సఖియా వివరించవే ...


ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ

సఖియా వివరించవే .....

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా

సఖియా వివరించవే .....

నిన్ను జూచి కనులు చెదరి .....
కన్నె మనసు కానుక జేసి .....
నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా వివరించవే .....

మల్లెపూలా మనసు దోచి

పిల్లగాలి వీచేవేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే .....

సినిమా : నర్తనశాల
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తిగారు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గారు
గానం : పి.సుశీల
Read more

హాస్యనట చక్రవర్తి "రాజబాబు"

Rajababu

తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్‌ రాజబాబు.
మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ హాస్యం ఏ మాత్రం పట్టుతప్పినా అపహాస్యం పాలవుతుంది. అటువంటి హాస్యాన్ని తమ నటన, వాచకంతో మెప్పించిన కస్తూరి శివరావు, చదల వాడ, నల్లరామ్మూర్తి, రమణారెడ్డి, రేలంగి, వంగర, శివరామ కృష్ణయ్య, తదితరులు ఒక ప్రత్యేకమైన నటనతో, హాస్యంతో ఆనాటి ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఆయా సన్నివేశాలను చూసినప్పుడు నవ్వని నేటి ప్రేక్షకులు కూడా ఉండరు. వారితో పాటు నటించి నేటి తరం ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన 'హాస్యనటచక్రవర్తి', మంచి మనిషి రాజబాబు.
హాస్యనటులు తమలో ఎంత బాధ ఉన్నా తెరపై చూసేవారికి నవ్వులు పూయించాలి. ఈ అనుభవం ఒకప్పటి ఎందరో హాస్యనటులకు అనుభవమే. అందుకే అన్నారేమో ఆత్రేయ 'నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి' అని. అలా కొన్ని సినిమాల్లో నవ్వించినా, మరికొన్ని సినిమాల్లో ఏడిపించినా అది ఆ హాస్యనటచక్రవర్తికే చెల్లింది. అంతేకాదు డైలాగ్‌ డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, నేటి ప్రేక్షకులు బ్రేక్‌, షేక్‌ అని చెప్పుకునే డ్యాన్స్‌లను ఆనాడే చేసి హాస్యనటుల్లో అద్భుతమైన డ్యాన్సర్‌గా చెప్పదగ్గ హాస్యనటుడు రాజబాబు.
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1938 సంవత్సరం అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించారు. ఈయనతోపాటు ఇప్పటి సినిమాల్లో నటిస్తున్న చిట్టిబాబు, అనంత్‌లు ఆయన తమ్ముళ్ళే. వీరు కూడా తెలుగులో మంచి హాస్యాన్ని అందించే హాస్యనటులుగా పేరుపొందారు.
ఇంటర్మీడియట్‌తో పాటు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సును పూర్తిచేసిన రాజబాబు కొంతకాలం పాటు టీచర్‌గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుండి వున్న నటనాభిలాషతో రంగస్థలంపై 'కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళచావడి' వంటి నాటకాల్లో సైతం నటించి రంగస్థలంపై మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నారు.  ఒకసారి ఈయన రంగస్థలంపై వేసిన నాటకం చూసిన అప్పటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావుగారు ప్రోత్సహించటంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళారు.
ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.  అంతేకాదు హాస్యనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారని, ప్రతి ప్రముఖహీరో చిత్రంలోనూ తప్పనిసరిగా ఈయనకు ఓ పాత్ర ఉండేలా దర్శకులు, నిర్మాతలు చూసేవారని అంతగా ఆయన జనాభిమానం పొందారని ఆనాటి సినీఅభిమానుల మాట. అలా 20యేళ్ళపైబడి ఈయన సినీజీవితంలో 590కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబునే  నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు.
తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు, మంచిమనిషి, అంతస్తులు, భీష్మ, పరువుప్రతిష్ట, నవరాత్రి, పరమానందయ్యశిష్యులకథ, ఉమ్మడికుటుంబం, విచిత్రకుటుంబం, గూఢచారి 116, సాక్షి, బంగారుపిచ్చిక, రణభేరి, కథానాయకుడు, కోడలు దిద్దినకాపురం, అందాలరాముడు, మహాకవి క్షేత్రయ్య, అల్లూరి సీతారామరాజు, బుజ్జిబాబు, గడసరి అత్త సొగసరి కోడలు ఇలా ఎన్నో చిత్రాల్లో తన నవ్వులను పూయించారు.
కేవలం హాస్యనటునిగానే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి యస్వీరంగారావు, అంజలిదేవి వంటి మహా మహులు నటించిన 'తాతా మనవడు' చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా ఆయన కేవలం హాస్యనటునిగానే కాకుండా సీరియస్‌, ఉదాత్తమైన పాత్రలు కూడా చేయగలరని నిరూపించింది ఆ చిత్ర ఘనవిజయం. పిచ్చోడిపెళ్ళి, తిరుపతి, ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. ఈయనకు సినిమాల్లో జోడిగా లీలారాణి, మీనా కుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమా ప్రభ వంటి వారు నటించినా రాజబాబు- రమాప్రభల జంట హిట్‌ఫెయిర్‌గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. నటనే కాకుండా గాయకు నిగా కూడా ఈయన అరుదుగా తన గళం వినిపించారు. ఈ పాట ప్రేక్షకులు అభిమానించే హాస్య పాటల్లో ప్రముఖమైన పాటగా నేటికీ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది అది ఇల్లు-ఇల్లాలు చిత్రంలో 'వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను' అంటూ సాగే పాటలో రాజబాబు గాత్రం వినిపించి ఆ పాటకు సరికొత్త అందాన్ని, ఆ చిత్ర విజయానికి దోహదం చేసిందంటే అతిశయోక్తికాదు.
అలాగే నటీనటుల  సరసనకు వస్తే ఎన్‌.టి.ఆర్‌.తో కథానాయకుడు, బడిపంతులు, అడవిరాముడు వంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. అలాగే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, తదితర నటులతో ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్‌, ఇల్లు-ఇల్లాలు,గూఢచారి 116, జీవనజ్యోతి, సొగ్గాడు వంటి చిత్రాలు ఉదాహరణలు మాత్రమే.
నటునిగానే కాకుండా నిర్మాతగా "బాబ్‌ అండ్‌ బాబ్‌ ప్రొడక్షన్" పై ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డునపడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నటించారు.
నటనలోనే కాదు వ్యక్తిత్వం లోను ఎంతో గొప్ప వాడని పించుకున్న  హాస్యరస చక్రవర్తి ఆయన. రాజబాబు కెరియర్ ని పరిశీలిస్తే, మంచితనానికీ ... మానవత్వానికి ఆయన ప్రతీకలా కనిపించే సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకసారి ఓ చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది.
అవి 'భలేకాపురం' (1980) సినిమా షూటింగ్ జరుగుతోన్న రోజులు. ఆ సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు. ఇక 'భలే కాపురం' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని చెన్నైలోని వాహినీ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు - రమాప్రభలపై కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీక రించవలసి ఉంది. అయితే, అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు, ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
       
  ఆ పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చక చకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో కప్పిపెడుతోన్న రాజబాబుని చూసి ఆయన షాక్ అయ్యారు. ''ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా'' అని గోపాలకృష్ణ కంగారుగా అన్నారు.
      
"నేను ఎంతో మందికి ఎన్నో చేశాను ... మీకు మాత్రం ఏమీ చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చేశాను'' అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడు, వెంటనే ఆయన సీన్స్ ని చక చకా తీసేసి పంపించారట. దాంతో రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ ఎరుగనట్టు బెడ్ పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు.  

సినిమాల్లో ప్రేక్షకులను మనసారా నవ్వించే రాజబాబు నిజజీవితంలో వేదాంతి, తాత్విక స్వభావం కలవారు. గతాన్ని మరచిపోకూడదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే జీవితానికి దారిచూపిస్తాయని రాజబాబు అభిప్రాయం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పాతతరం నటీనటులను, ముఖ్యంగా హాస్యనటులను సన్మానించేవారు.

రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దానధర్మాలు చేసాడు.  తన కష్టకాలంలో ఒక పాక  హోటల్లోని స్త్రీ పెట్టిన  టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు.   ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.  మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ సమయంలో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. కోరుకొండలో జూనియర్‌ కాలేజీని కట్టించారు., రాజమండ్రిలో పేదలకు ఇంటిస్థలం ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి. హాస్యం బ్రతికున్నం తకాలం ఆయన ప్రేక్షకుల మదిలో సదా చిరంజీవే.
అవార్డుల విషయానికొస్తే వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డును పొందిన మొదటి హాస్యనటుడు రాజబాబే. తన నట జీవితంలో 9 ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు నంది అవార్డులు ఇలా ఇంకా ఎన్నో సేవా సంస్థలు, ఇతరసంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. శతాబ్దపు హాస్యనటునిగా కీర్తించ బడ్డ ఈయన్ను 'హాస్యనట చక్రవర్తి'గా పిలుచుకునేవారు.
1965లో వివాహమైన రాజబాబుకు ఇద్దరు పిల్లలు. రాజబాబు భార్య లక్ష్మి అమ్ములు, మహాకవి శ్రీశ్రీ మరదలు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. తమ్ముళ్లు చిట్టిబాబు, అనంత్ హాస్యనటులుగా కొనసాగుతున్నారు.
అనుకరణకు అందని నటుడు రాజబాబు. వాచకంలోకాని, అభినయంలోకాని ఆయన శైలి ఎవరికి రాదు. అటువంటి గొప్ప హాస్యనటుడు, మంచి మనిషి 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న  స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో ఓ మంచి హాస్యం కనుమరుగైపోయింది.
http://www.telugubidda.in సౌజన్యంతో....
Read more

"సూర్యకాంతం" గయ్యాళే... అయినా అందరి మనసు దోచుకుంది

suryakantam actressసూర్యకాంతం... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు. సూర్యకాంతం పేరు వింటేనే కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా, అమె `గయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"
 ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సివస్తే, కత్తులు, తుపాకులు అవసరంలేని మాటల తూటాలతో పాత్రకున్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఎవరినా, “ధధిగిణ ధోం” అని ఆమె ధోరణులకు వంతు పాడవలసినదే. ఏ దర్శకుడు, నిర్మాత అయినా సరే, సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసినదే. మాటలు సూదుల్లా గుచ్చుకునేలా వున్నా, మనసులోమాత్రం వాటికి వెన్న, తేనె పూసింది అన్నది కొందరికే తెలిసిన విషయం. అందం అంటే కేవలం భౌతికం కాదు, మనసు, మాట, హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్నిబట్టి అందాన్ని అంచనా వేయాలి అంటే, సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రధమంగా చెప్పాలి. దరికిరానీయని గర్వం, అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్ధం చేసుకుని నటించగలిగే సామర్ధ్యంగల తారాకాంతం, సూర్యకాంతం.

బాల్యం:
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.
సినీ జీవితం:
మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
అవి దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన రోజులు. దాసరి రాసిన ఒక డైలాగ్ సూర్యాకాంతంకు నచ్చలేదు. ఆ డైలాగ్ మార్చమని సూర్యాకాంతం అడిగితే దాసరి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అదే డైలాగ్ ను చెప్పి షాట్ ఒకే చేశారు. అయితే, ఈ సంఘటనతో దాసరి బాధపడ్డారు.  కాగా, తరువాత మరో షూటింగ్ లో పాల్గొన్న సూర్యాకాంతం అక్కడ కూడా డైలాగ్ మార్చమనిఅడిగారు. వెంటనే ఆ రైటర్ ‘సరే’ అన్నాడు. దానికి సూర్యాకాంతం ’నువ్వేం. రైటర్ వయ్యా.. ఏది మార్చమంటే అది మారుస్తానంటున్నావు.. నవ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం లేదా.. దాసరి చూసి నేర్చుకో‘ అని మందలించారు. ఈ సంగతి తెలిసిన దాసరి ఎంతగానో సంతోషించారు.
 “పాత్ర తిట్టిందమ్మా! నువ్వు ఎందుకు బాధపడతావు” అని ఓ పాత్రద్వారా నాగయ్య పాత్రను తిట్టినందుకు అపరాధం క్షమించండీ అని ఆయన కాళ్ళమీద పడి మన్నించండి అని వేడుకోవడం లోనే, ఎప్పుడూ నాన్నగారూ అని నాగయ్యను పిలిచే, ఆమె మనసుచల్లదనం బయటపడుతుంది.
అత్తగారుగా వెలిగిన ఆమెను, అక్కగారు, దొడ్డమ్మగారు, పెద్దవారు “కాంతమ్మా౧” అని పిలవడంపట్ల సూర్యకాంతం అందరి వయసువారికి దగ్గరిబంధువు.
న్యాయంగా ఆమె వేసే పాత్రల్ని బట్టి “అత్తగారూ” అని పిలవడం ధర్మం; “ఆమ్మో! బయటకూడా అలా పిలిస్తే ఈ కోడళ్ళం బతికినట్లే! – అని మహానటి సావిత్రి చమత్కారవ్యాఖ్యానం.
ఓసారి 'శ్రీమంతుడు' సినిమా షూటింగులో జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం తాను చెప్పవలసిన డైలాగులు అయిపోయినప్పటికీ ఆమె ఇంకా ఏవో డైలాగులు చెబుతూనే ఉందట. దర్శకుడు ప్రత్యగాత్మ కట్ చెప్పకుండా అలానే చూస్తుండిపోవడంతో, ''అదేంటి నాయనా... నా మటుకు నేను ఏదో చెప్పుకుపోతుంటే కట్ చెప్పడంలేదు'' అన్నారు. ''మీరు అదనంగా చెబుతోన్న డైలాగులు బాగానే ఉన్నాయి కదా... అని ఊరుకున్నాను'' అన్నారాయన. ''అలాగా ... అయితే అదనంగా చెప్పిన డైలాగులకి కాస్త అదనంగా ఏదైనా ఇప్పించు నాయనా'' అంటూ ఆమె అందర్నీ నవ్వించారు. 
నటనా శైలి :
సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటుల పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
వ్యక్తిత్వం:
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!
షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్య ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.
మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
చివరిగా సూర్యకాంతం నిర్వచనం:
నటనద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసరిన సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లికబుర్లు చోటుచేసుకున్నా, ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం – వెరసి పెద్దిభొట్ల సూర్యకాంతం. గయ్యాళి అత్తకు మరోపేరు. మనసున్న అమ్మకు సమానార్ధ్ం. అందుకే – తెరపైన “అత్త”, తెరవెనుక “అమ్మ” అన్న నిర్వచనం సరిసములులేని భావన. చిత్రాల్లో సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు, సహనటీనటులకు యింటినుంచి షడ్రసోపేతమైన ఆహారభోజనాల్ని తెచ్చిపెట్టడం, ఆ రుచులతో గయ్యాళితనాన్ని మరచిపోయి, మనసున్న మహామనీషిగా గుర్తింపు అలవోకగా తెచ్చుకుంది. పులిలా కనిపించే ఈమె హస్తవాసితనం పులిహోర తయారీలో సిద్ధహస్తురాలు, గోలచేయని గోంగూరపచ్చడి, మాయామర్మంలేని ఆవకాయ, అధ్బుతాల్ని అందించే అల్లంపచ్చడి, కన్నులవిందైన కందిపొడితోపాటు బిగుతైన డబ్బాతో ఘుమఘుమలాడే నేతిసరుకుని కూడ యింటినుంచి దిగుమతిచేసుకునివచ్చి, వివాహభోజనసమానమైన బలేపసందుల విందును అనుభవించేవారు
“సూర్యకాంతం” వ్యక్తిత్వం, నటన, ఈ ధరణిపై సూర్యకాంతి, చంద్రునిచల్లదనం ఉన్నంతవరకూ, సూర్యకాంతమ్మ సూరజముఖిలా వికసిస్తూ, నిత్యం కాంతినిస్తూ తెలుగుప్రజను నిండుగా అలరిస్తూనే వుంటుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, విడ్డూరం లేని పరమసత్యాలు.
నటించిన సినిమాలు:
    ధర్మాంగద (1949)
    సంసారం (1950)
    పెళ్ళిచేసి చూడు (1952)
    బ్రతుకుతెరువు (1953)
    కన్యాశుల్కం (1955) (మీనాక్షి)
    దొంగరాముడు (1955)
    చరణదాసి (1956)
    శ్రీ గౌరీ మహత్యం (1956)
    భాగ్యరేఖ (1957)
    మాయాబజార్ (1957)
    తోడికోడళ్ళు (1957)
    దొంగల్లో దొర (1957)
    అప్పుచేసి పప్పుకూడు (1959)
    మాంగల్యబలం (1959)
    కృష్ణలీలలు (1959)
    భాగ్యదేవత (1959)
    జయభేరి (1959)
    శాంతినివాసం (1960)
    ఇద్దరు మిత్రులు (1961)
    పెళ్లికాని పిల్లలు (1961)
    భార్యా భర్తలు (1961)
    వాగ్దానం (1961)
    వెలుగునీడలు (1961)
    శభాష్ రాజా (1961
    కలసి ఉంటే కలదు సుఖం (1961)
    మంచిమనసులు (1962)
    రక్తసంబంధం (1962)
    సిరిసంపదలు (1962)
    గుండమ్మకథ (1962)
    తిరుపతమ్మకథ (1963)
    నర్తనశాల (1963) (అథిది పాత్ర)
    పరువు ప్రతిష్ఠ (1963
    చదువుకున్న అమ్మాయిలు (1963
    మురళీకృష్ణ (1964)
    మూగమనసులు (1964)
    డాక్టర్ చక్రవర్తి (1964)
    ఉయ్యాల జంపాల (1965)
    నవరాత్రి (1966)
    సంగీతలక్ష్మి (1966)
    ఆస్తిపరులు (1966)
    కన్నెమనసులు (1966)
    బ్రహ్మచారి (1967)
    సుఖ దు:ఖాలు (1967)
    ఉమ్మడికుటుంబం (1967)
    అత్తగారు-కొత్తకోడలు (1968)
    బుద్ధిమంతుడు (1969)
    ఆత్మీయులు (1969)
    బాలరాజు కథ (1970)
    దసరాబుల్లోడు (1971)
    అమాయకురాలు (1971)
    కాలం మారింది (1972)
    కొడుకు కోడలు (1972)
    అందాల రాముడు (1973)
    ముత్యాల ముగ్గు (1975)
    సెక్రటరి (1976)
    గోరంతదీపం (1978)
    రాధాకృష్ణ (1978)
    కార్తీక దీపం (1979) (శారదా తల్లి)
    వియ్యాలవారి కయ్యాలు (1979)
    చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
    పెళ్ళిచూపులు (1983
    బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989)
    వన్ బయ్ టూ (1993)

మూలం / సేకరణ: wikipedia
http://www.telugubidda.in సౌజన్యంతో....
Read more

Wednesday, December 3, 2014

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల

చిత్రం : తోడికోడళ్లు (1957)
రచన : ఆత్రేయ
దర్శకులు : ఆదుర్తి సుబ్బారావు 

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

నోట్ : ఈ పాట శరత్  బెంగాలి నవల “నిష్కృతి” ఆధారంగా  దుక్కిపాటి మధుసూదన రావు నిర్మించిన “తోడికోడళ్లు” సినిమా లోనిది.
Read more

నేనొక ప్రేమ పిపాసిని -

చిత్రం : ఇంద్రధనుస్సు (1978)
గానం : బాలసుబ్రహ్మణ్యం

నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 1:
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 3:
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..
Read more

Thursday, November 27, 2014

తెలుగు సంగీతఝరి సుశీలమ్మ

మావి చిగురు తిని కోకిల పలుకుతుంది. కోకిల గొంతు విని మావి చిగురు చిగురిస్తుంది. ఈ రెండింటికీ మధ్య మరో లయవిన్యాసం ఉంది. అదే గానకోకిల సుశీల మధురస్వరం. పసిపాప నవ్వులోని స్వచ్ఛదనం. పాలనురుగులోని తియ్యదనం. కోయిల గొంతులోని కమ్మదనం. స్వాతిచినుకులోని తన్మయత్వం కలబోస్తే సుశీల గానం. తెలుగు సంగీతఝరిలో  పి.సుశీల ఒక ఆణిముత్యం. పాటల జలధిలో అలుపెరుగని అమృతగానం.
తెలుగు పాటల కొమ్మలో విరబూసిన కుసుమం...
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉందంటారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదుగాని తెలుగు పాటల కొమ్మలో విరబూసిన కుసుమం సుశీల గాత్రాన్ని వింటే ఇది నిజమేననిపిస్తుంది.  కోకిలమ్మకు కూడా కుహు..కుహు అని రాగాలు తీయాలనిపిస్తుందేమో.
మృదువైన స్వరానికి సుశీల చిరునామా....
శ్రావ్యమైన సంగీతానికి, మృదువైన స్వరానికి సుశీల చిరునామా అంటే అతిశయోక్తి కాబోదు. ఒకటి కాదు రెండు కాదు...వేవేల పాటలు పాడి, రెండు తరాల తెలుగు ప్రేక్షకులను తన గానామృతంలో ముంచితేల్చింది. సంగీత ప్రియుల చెవిలో అమృతపు చుక్క అయ్యింది ఈ గాన కోకిల. పసిపాప జోల పాట సుశీల. ఆలుమగల అనురాగాల తోట సుశీల. యువకుల మదిలిలో చక్కిలిగింత సుశీల. అమ్మదనపు కమ్మదనం సుశీల. యుగళగీతాల మాలిక సుశీల.
సోలో పాటల్లో తనదైన ముద్ర...
అటు పాతతరం కథానాయికలకు, ఇటు కొత్త తరం కథానాయికలకు తన గాత్రంలోని గానమాధురిని అందించారు సుశీల. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి కొమ్ములు తిరిగిన నేపథ్యగాయకులతో పాడి తెలుగుపాటకు పరిపూర్ణతను తీసుకొచ్చారు. యుగళ గీతాలనే కాదు సోలో పాటల్లోనూ తనదైన ముద్రవేసి తెలుగు పాటను శిఖరాగ్రానికి చేర్చారు సుశీల.
స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఆమె సొంతం...
స్పష్టమైన భావ ప్రకటన. అంతకంటే స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ సుశీల సొంతం. అందుకే ఆమె గాత్రంలో ప్రేక్షకులకు ఆలుమగల అనురాగం కనిపిస్తుంది. ప్రియుడికి తన ప్రియురాలి పాటలా వినిపిస్తుంది. కురిసే ప్రతీ చినుకు ఆకుపై రాలి దోబూచులాడలనుకుంటుంది. మెరిసే ప్రతి మేఘం వర్షించి వానలా కురవాలనుకుంటుంది. అలాగే తెలుగునాట పుట్టిన ప్రతీపాట సుశీల గాత్రంలో ఒదిగిపోవాలనుకుంటుంది. తెలియని తన్మయత్వంతో తన పుట్టుకకు పరిపూర్ణతను తెచ్చుకోవాలనుకుంటుంది.
సుశీల లేని తెలుగుపాటను ఊహించుకోగలమా.
సప్తస్వరాలు ఆమెను ఆవహించాయా అన్నట్టుగా ఉంటుంది సుశీల గానం. పాటే ప్రాణంగా పాడే ప్రతీ పాటకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. అందుకే ఈ గానసరస్వతి గాత్రానికి దాసోహం కాని ప్రేక్షకులు లేరు. ఓ రకంగా చెప్పాలంటే సుశీల లేని తెలుగు పాటను ఊహించుకోలేరు సంగీత ప్రియులు.
సుశీల 15వ ఏట నుంచే....
సంగీత నేపథ్యమున్న కుటుంబంలో జన్మించిన సుశీల 15వ ఏట నుంచే తన స్వరప్రస్థానాన్ని ప్రారంభించారు. జన్మతహా వచ్చిన ఆమె గాత్రానికి సినిమా రంగం నగిషీలు చెక్కింది. నాటి సంగీత శిఖరం పెండ్యాల నాగేశ్వరరావు దర్వకత్వంలో మొదలైన సుశీల సినీ గానప్రస్థానం 60 ఏళ్లపాటు అప్రతిహతంగా సాగింది. సుశీల సినీరంగ ప్రవేశం చేసేనాటికి స్వర దిగ్గజాలు పి.లీలా, జిక్కి, భానుమతి వంటి నేపథ్య గాయనీమణులు తెలుగు ప్రేక్షకులను తమ గానామృతంలో ఓలలాడిస్తున్నారు. అలాంటి తరుణంలో ప్లేబ్యాక్ సింగర్‌గా తెలుగు తెరకు పరిచయమైన సుశీల తన గాత్రంలోని విలక్షణతను ప్రేక్షకులకు రుచిచూపించారు. సోలో, భక్తి పాటలనే కాదు డ్యూయెట్లను కూడా తన స్వరంలో గింగిరులు కొట్టించారు.
అతి తక్కువ కాలంలోనే....
నేపథ్యగాయనిగా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే సుశీల పాపులర్ అయ్యారు. అలాపలను అలవోకగా పాడి హుషారెత్తించారు.  తెలుగు పదాలను హాయిగా పాడుతూ తెలుగు ప్రేక్షకులను జోకొట్టారు సుశీల. ఒక పాటకు మించి మరో పాట. దేనికదే ప్రత్యేకత. సుశీల పాడిన పాటల్లో ఏది ది బెస్ట్ అని అడిగితే సినీ సంగీత వినీలాకాశంలో తళుక్కుమనే తారలను లెక్కించడమే అవుతుంది.  పాటల సాగరగర్భంలో ఆణిముత్యాలను ఏరడమే అవుతుంది.సంగీతం తప్ప మరే ఇతర భాష రాని సుశీల తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోను అనర్గళంగా పాడి సంగీతానికి భాషాబేధాలు ఉండవని మరోసారి నిరూపించారు.
ఆధునిక పోకడలకు అనుగుణంగా.....
మహామహులైన సంగీత దర్శకుల దగ్గర పాడిన సుశీల కొత్తతరం దర్శకుల దగ్గర అంతే వినమ్రంగా పాడి సంగీతంలో చిన్నాపెద్దా తేడా ఉండదని చాటిచెప్పారు. సుశీల క్లాసికల్‌ పాటలే పాడుతారన్న ప్రచారానికి అప్పుడప్పుడే తెరకు పరిచయమౌతున్న సంగీత దర్శకులు చక్రవర్తి బ్రేకులేశారు. గుగ్గుగుగ్గు గుడిసుంది, గుడివాడకెళ్లాను లాంటి పాటలను సుశీలతో పాడించి ఆమెను మాస్‌కు మరింత చేరువ చేశారు.
దక్షిణాదిన తిరుగులేని ఆధిపత్యం....
గోదారి గట్టుపై ఆమె పాట వినిపిస్తుంది.. మొక్కజొన్న తోటలో సుశీల గానం గింగిరులు కొడుతుంది.. ఆమె స్వరానికి ప్రేపల్లియ ఎద ఝల్లున పొంగుతుంది. అదీ సుశీలమ్మ మహత్యం. అదీ ఆమె గానంలో దాగున్న అమృతం. 1957 తరువాత కొత్త నేపథ్యగాయనీమణులు తెలుగు ప్రేక్షకులకు కొత్త స్వరాలను వినిపించినా సుశీలమ్మ గాత్రాన్ని మాత్రం జనం మర్చిపోలేదు. జయసుధ, రాధ, రాధిక, విజయశాంతి వంటి నవతరం నాయికలకు  కూడా తన గాత్రాన్ని అందించి హుషారెత్తించారు. దక్షిణాదిన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
50వేల గీతాలతో సుస్థిర స్థానం...
రెండు తరాల గాయకులతో కలిసి పాడినా సుశీల గాత్రంలో ఆ మాధుర్యం తగ్గలేదు. దాదాపు 50 వేల గీతాలు ఆలపించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సుశీల. లెక్కకు మిక్కిలి పాటలు పాడిన సుశీలకు అవార్డులకు, రివార్డులకు కొదవలేదు. 2008లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌తో సత్కరించింది. జెమినీ, వాహిని, గోల్డెన్‌, వాసు, విక్రమ్, శారద, ప్రకాశ్‌, అన్నపూర్ణ సంస్థల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు సుశీల.
గానకోకిల సుశీల 80వ జన్మదినం...
వసంత రుతువులో ఎన్ని కోకిలలు వచ్చినా  సినీ వినీలాకాశంలో ఎన్ని కొత్తగాత్రాలు పుట్టినా సుశీల గాత్రానికి తిరుగులేదు. ఆమె పాటలకు కాలదోషం పట్టదు. తెలుగు పాటల పూపందిరిలో ఆమె స్వరం నిత్యనూతనంగా ఆలపిస్తూనే ఉంటుంది. 80 వసంతాల సుశీల స్వరానికి టెన్‌టీవీ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.
- 10టీవీ సౌజన్యంతో
Read more

Wednesday, November 26, 2014

నవమినాటి వెన్నెల నేను..

శివరంజని (1978) 
సంగీతం : రమేష్ నాయుడ
రచన : సినారె,
గానం : బాలు

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..

కలుసుకున్న ప్రతిరేయి.
కార్తీక పున్నమి రేయి....

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..

కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయీ.

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..


నీ.. వయసే వసంత రుతువై..
నీ మనసే.. జీవన మధువై ..
నీ.. వయసే వసంత రుతువై..
నీ మనసే.. జీవన మధువై ..

నీ పెదవే నా పల్లవిగా ..
నీనగవే.. సిగమల్లికగా..
చెరిసగమై..
ఏ సగమేదో.. మరచిన మన కలయికలో.. .

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..

కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయీ.

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..


నీ... ఒడిలో వలపును .. నేనై..
నీ గుడిలో వెలుగే.. నేనై..

నీ... ఒడిలో వలపును .. నేనై..
నీ గుడిలో వెలుగే.. నేనై..

అందాలే.. నీ హారతిగా..
అందించే.. నా పార్వతిగా..
మనమోకటై..
రస జగమేలే.. సరస మధుర సంగమ గీతికలో..

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలి.. నీవు..

కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయీ.

నవమినాటి వెన్నెల నేను..
దశమి నాటి జాబిలీ.. నీవూ..
Read more

నా ప్రాణమా నను వీడిపోకుమా

 అనితా ఓ అనితా :
 రచన, గానం : నాగరాజు

నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నినే కలవరిస్తుంది..
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనితా అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ కాస్తయిన నా పేద ప్రేమ పైన
ప్రాణమా నను వీడిపోకుమా
ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగనీకు మా..

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నానని
ప్రేమ అనే పంజరాన చుక్కాని పడి ఉన్న కలలో కూడా నీ రూపం
నను కలవర పరచానీకు పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టే
నువ్వొకచోట నేనోకచోట నిను చూడకుండానే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నేవేన రేపటి స్వప్నం నీవేనా
ఆశల రానివి నీవేనా గుండెకు గాయం చెయ్యకే
అనిత అనిత అనితా ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగానీకుమా
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణం ధ్యానిస్తూ, పసిపాపలా చూస్తా
విసుగు రాని నా హృదయం ని పిలుపుకే ఎదురు చూసే
నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకు అనిపించే
కరునిస్తావో, కాటేస్తావో నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
నను వీడని నీడవు నీవే ప్రతి జన్మకి తోడువు నీవేనా
కమ్మని కలలు కూల్చి నన్ను వంటరివాడిని చెయ్యకే!

అనిత ఓ వనిత ఆ అందమైన అనిత
దయలేదా కాస్తయినా నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగానీకుమా
పదే పదే నా మనసు నినే కలవరిస్తోంది.
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనిత అనిత అనిత ఓ వనిత
నా అందమైన అనిత
దయలేదా కాస్తైన నా పేద ప్రేమపైన

ఏదోరోజు నాపై ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ
నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా (2)
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
అనిత అనిత అనితా ఓ వనిత
అందమైన అనిత దయ లేదా నా కాస్తైన నా పేద ప్రేమ పైనా
Read more

జాబిల్లి కోసం ఆకాశమల్లే

మంచి మనసులు(1986) 

సంగీతం)   : ఇళయరాజా

గానం : బాలు

రచన : ఆత్రేయ

 
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుక్కడ
మనసుక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుక్కడ
మనసుక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిద్దుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నే పంపి నాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నాల్లైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నాల్లైనా
ఉండీలేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్న నా తోడు నీవే నీ దగ్గరున్న నీ నీడ నాదే నాదన్నదంత నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై
Read more

పులకించని మది పులకించు

చిత్రం   పెళ్ళికానుక (1960)
నటులు : అక్కినేని, కృష్ణకుమారి, బి.సరోజాదేవి

సంగీతం :  ఏ.ఎం.రాజా
గానం జిక్కి
రచన  :  ఆత్రేయ 


పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు
మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

రాగమందనురాగ మొలికి
రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు
రూపమిచ్చును గానం

చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం
జీవ మొసగును గానం ..
మది చింత బాపును గానం ..
వాడిపోయిన పైరులైనా నీరు
గని నర్తించును కూలిపోయిన తీగయైనా

కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు
ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు
దోర వలపే కురియు...
మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని//
Read more

ఏ దివిలో విరిసిన పారిజాతమో

 సినిమా   : కన్నెవయిస్సు(1973) సంగీతం  : సత్యం
గానం  : బాలూ, సుశీల
సాహిత్యం      : దాశరధి

ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే ..
ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...

నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో..

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే..

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...నామదిలో నీవై నిండిపోయెనే..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే ..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
Read more

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై

చిత్రం : డమరుకం (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, 

గానం : శ్రీకృష్ణ, హరిణి

నేస్తమ నేస్తమ నువ్వే కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
నేననె పేరులొ నువ్వు నువ్వనె మాటలొ నేను
ఈ క్షణం ఎంత బాగుందొ ప్రేమ లాగ
హొ హొ ప్రేమకె రూపమె ఇచ్చె దానికె ప్రాణమె పోస్తె
ఉండద నిండుగ మనలోనా.. ఆ.. ఆ

నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం

నువ్వంటె
ఎంతిష్టం
సరిపోదే ఆకాశం
నాకన్న
నువ్విష్టం
చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీవె కల ఎద ఏటిలోన నువ్వె అల
క్షణ కాలమయిన చాల్లె ఇల అది నాకు వెయ్యేళ్లే
ఇల ఈ క్షణం కాలమే ఆగిపొవాలీ ఓ

నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోస
ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం

అలుపొస్తె
తల నిమిరె
చెలినవుతా నీకొసం
నిదరొస్తె
తల వాల్చె
ఒడినవుతా నీకొసం
పెదవంచు పైన నువ్వే కద
పైటంచు మీద నువ్వే కద
నడువొంపు లోన నువ్వె కద
ప్రతి చోట నువ్వేలే
అర చేతిలో రేఖలా మారిపోయావే ఓ

నేస్తమ నేస్తమ నువ్వె కోయిలై వాలతానంటె తోటల మారన నీకోసం
ప్రాణమ ప్రాణమ నువ్వె వేకువై చేరుతానంటె తూరుపై చూడన నీకోసం
Read more

పిలిచిన పలుకవు ఓ జవరాలా


సినిమా : పిడుగు రాముడు (1966) 
నటులు : ఎన్టీఆర్, రాజశ్రీ 
సంగీతం : టి.వి.రాజు 
దర్శకత్వం : బి.విఠలాచార్య 
గానం : ఘంటసాల, పి.సుశీల 
రచన : డా॥సి.నారాయణరెడ్డి
 పల్లవి :
పిలిచిన పలుకవు ఓ జవరాలా (2)
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయుడు చూసే వేళ (2)
చెలియను కవ్వించు వేలాయేలా
కలువల రాయుడు చూసే వేళ
చరణం : 1
చల్లగ విరిసే నీ చిరునవ్వులు (2)
మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు (2)
తొందర చేసెను నీలోన ॥

చరణం : 2
జగములనేల సొగసే నీదని (2)
గగనములో దాగే నెలఱేడు
మనసున దోచే మరుడవు నీవని (2)
కనుగొంటినిలే ఈనాడు
॥॥
పిలిచిన పలుకవు ఓ జవరాలా
Read more

ఏ.యం.రాజా

A.M.Raja 

 పరిచయం :

  • ఏ.యం.రాజా ( అయిమల మన్మథరాజు రాజా) తమిళ, తెలుగు సినిమా రంగాలలోవిశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారంచేసింది. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుకలోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
ప్రొఫైల్ :
  • పేరు : ఎ.యం.రాజా , అయిమల మన్మథరాజు రాజా,
  • పుట్టిన తేది : 01 జూలై 1929,
  • పుట్టిన ఊరు : రామచంద్రాపురం - చిత్తూరు జిల్లా ,
  • తండ్రి : మన్మధరజు ,
  • తల్లి : లక్ష్మమ్మ ,
  • భార్య : గాయని జిక్కి ,
  • చదువు : తను 3 మాసాల వయసున్నపుడే తండ్రి చనిపోవడం వలన 'రేనుకపురం ' వెళ్ళిపోయారు అక్కడే చదువు మొదలై , మద్రాస్ కాలేజి లో బి.ఎ.(1951) పూర్తిచేసారు .
  • పిల్లలు : ఆరుగులు , లో ఒక్క చంద్రశేఖర్ తండ్రి గాత్రం తో గాయకుడయ్యారు ,
  • మరణము : 08 ఏప్రిల్ 1989 - స్లిప్ అయి ట్రైన్ ట్రాక్ కి ప్లాట్-ఫోరం కి మధ్య పడి  చనిపోయారు - వెల్లూరు రైల్వే స్టేషన్ (తిరునేల్వెల్లి జిల్లా ).
చిత్ర సమారాహం :
  • నేపథ్య గాయకునిగా
  • పెళ్ళి కానుక (1960) * రాజనందిని (1958) * అప్పు చేసి పప్పు కూడు (1958)
  • అల్లావుద్దీన్ అద్భుతదీపం (1957) * భాగ్యరేఖ (1957) * ఎమ్.ఎల్.ఏ. (1957)
  • పెంకి పెళ్ళాం (1956) * మిస్సమ్మ (1955) * విప్రనారాయణ (1954)
  • అగ్గి రాముడు (1954) * బంగారు పాప (1954) * శ్రీ కాళహస్తి మహత్యం (1954)
  • పక్కింటి అమ్మాయి (1953),
  • రాజా నందిని -1958 ,
  • అప్పుచేసి పప్పుకూడు 1958,
  • భాగ్య రేఖ - 1957,
  • యం.యల్.ఎ.(MLA) - 1957,
  • మిస్సమ్మ - 1955,
  • విప్రనరయన్ - 1954 ,
  • బంగారు పాప -1954 ,
  • శ్రీ కాలహస్టేస్వర మహత్యం - 1954,
సంగీత దర్శకునిగా :
  • పెళ్ళి కానుక (1960)
నటునిగా  :
  • పక్కింటి అమ్మాయి (1953 సినిమా)
  • అశ్వత్థామ,
Read more

Sunday, November 23, 2014

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన

మేఘసందేశం (1982)

సంగీతం: రమేష్ నాయుడు

సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.ఏసుదాస్

 ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని .. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో .. ఉలిపిరి చినుకుల బాసలతో+
విన్నవించు నా చెలికీ .. విన్న వేదనా నా విరహ వేదనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో .. రుధిర భాష్పజల ధారలతో
ఆ..ఆ..ఆ..ఆ

విన్నవించు నా చెలికీ .. మనోవేదనా నా మరణయాతనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం
Read more

ఎవరో ఒకరూ.. ఎపుడో అపుడూ..

అంకురం (1992)

సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, బాలు


ఎవరో ఒకరూ..
ఎపుడో అపుడూ..
ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు

ఆ..ఆ..
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుక వచ్చు వాళ్ళకూ బాట అయినదీ

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

కదలరు ఎవ్వరూ..వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదురపోదుగా
జగతికి మేలులొల్పు మానుకోదుగా

మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేల దారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ !

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

చెదరకపోదుగా చిక్కని చీకటీ
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికీ
దానికి లెక్క లేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్ప వెనక ఆపనీ కంటి నీటినీ
సాగలేక ఆగితే దారి కరుగునా
జాలి చూపి తీరమే దరికి చేరునా !!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ..

యుగములు సాగినా..నింగికి తాకకా
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఇంత వేడి ఎండతో వళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడూ కళ్ళూ మూయడా
నల్లమబ్బు కమ్మితే చల్లబారడా !!!

ఎవరో ఒకరూ..ఎపుడో అపుడూ
నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపు
అటో ఇటో ఎటోవైపూ !
Read more

నిను చూడక నేనుండలేను .. ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...

నీరాజనం

సంగీతం :ఓ.పి నయ్యర్
గానం :బాలు, జానకి



ఆ ఆహా హా
ఆ ఆహా హా
ఓహో ఓహో ఓహో


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....

నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను

ఆహహా .. ఆహహా
ఆహహా .. ఆహహా
ఆహహా .. ఓహోహో
ఓహోహో... ఆహాహా


ఏ హరివిల్లు విరబూసినా ..నీ దరహాశమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా...నీ చరణాల శ్రుతి మింటినీ
నీ ప్రతీ రాకలో ఎన్ని శశిరేఖలో ..నీ ప్రతీ రాకలో ఎన్ని శశిరేఖలో


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
 
ఓహో హో ఆహాహా ఆహాహా ఓహోహో


నీ జతగూడి నడయాడగా ..జగమూగింది సెలయేరులా
ఒక క్షణమైనా నిను వీడినా ..మది తొణికింది కన్నీరుగా


మన ప్రతి సంగమం ఎంత హ్రుదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హ్రుదయంగమం


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
ఈ జన్మ లొ మరి ఆ జన్మలో ...ఈ జన్మ లొ మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే ....


నిను చూడక నేనుండలేను ..నిను చూడక నేనుండలేను
Read more

ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం

శశిరేఖాపరిణయం (2008)

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైంధవి


ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం .. అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనూ .. నా వెనుక తానూ
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం !

ఎదో ఎదో ఏదో .. వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో .. చెప్పనంటోంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా ..
మెల్లగా సిగ్గును కదిపిందా ..
వానలా మనసును తడిపిందా ..
వీణలా తనువును తడిమిందా (2)

చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో .. వయసుకేమి తెలిసిందో
ఆదమరుపో .. ఆటవిడుపో .. కొద్దిగా నిలబడి చూద్దాం

ఓ క్షణం ..
అంటే .. కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే .. ఎదురు తిరిగింది నా హృదయం !
Read more

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

శశిరేఖాపరిణయం (2008)

సంగీతం: మణిశర్మ, విద్యాసాగర్

సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

 
నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకునీ .. కొలువుంచే మంత్రం నీవవనీ

ప్రతీ పూట పువ్వై పుడతా .. నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెల అవుతా .. నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ !

నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా !

ఆ.. ఆ .. నిన్నే నిన్నే అల్లుకునీ .. కుసుమించే గంధం నేనవనీ

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాశ వీణలోని మధురిమ నీవే సుమా
గంగపొంగు నాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించీ ధారపోయనా
ఆయువంత వెలిగించీ .. హారతీయనా

నిన్నే నిన్నే నిన్నే ..
ఓ .. నిన్నే నిన్నే నిన్నే !

Read more

ఎదుటా నీవే యెదలోన నీవే

అభినందన

సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు


 
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే



మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం


గాయాన్నైనా మాన నీవు
హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు


ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే
ఎదుటా నీవే యెదలోన నీవే



కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను


స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా
Read more

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

గులాబి

సంగీతం : శశీ ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల
గానం : సునీత


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ


ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది


నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను
Read more

మనసున మల్లెల మాలలూగెనే

మల్లీశ్వరి (old)

సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి


మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే


ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో


కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా


అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా

దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా


నీవు వచ్చేవని.. నీ పిలుపే విని
నీవు వచ్చేవని.. నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని


ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా


ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
Read more

సడి సేయకో గాలి.. సడి సేయబోకే

రాజమకుటం

సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.లీల


సడి సేయకో గాలి.. సడి సేయబోకే

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే

సడి సేయకే..

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజుగాకేమి
చిలిపి పరుగులు మాని కొలిచి పోరాదె

సడి సేయకే..

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి జూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే

సడి సేయకే..

పండువెన్నెల నడిగి పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడి సేయకో గాలి..
Read more

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

కాంచనగంగ

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి



నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


నీవే..నీవే..నా ఆలపనా
నీలో..నేనే..ఉన్నా !


నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


నీ అందమే .. అరుదైనదీ
నా కోసమే .. నీవున్నదీ
హద్దులు చెరిపేసీ .. చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి .. చిరుముద్దులు కలబోసీ


పగలూ రేయీ ఊగాలమ్మ పరవళ్ళలో ..

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


ఏ గాలులూ .. నిను తాకినా
నా గుండెలో .. ఆవేదనా
వలపే మన సొంతం .. ప్రతి మలుపూ రసవంతం
వలపే మన సొంతం .. ప్రతి మలుపూ రసవంతం


కాగే విరహం కరగాలమ్మ కౌగిళ్ళలో ..

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


నీవే..నీవే..నా ఆలపనా
నీలో..నేనే..ఉన్నా !


నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
Read more

పరువం వానగా నేడు కురిసేనులే

రోజా

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే


నీ చిగురాకు చూపులే .. అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే .. అవి నా బంగారు నిధులే
నీ పాలపొంగుల్లో తేలనీ .. నీ గుండెలో నిందనీ
నీ నీడలా వెంట సాగనీ .. నీ కళ్ళల్లో కొలువుండనీ !


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే ..ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే !


నీ గారాల చూపులే .. నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే .. నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో .. నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో .. నీ పరువాలు పలికించుకో


పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే


నదినే నీవైతే .. అల నేనే
ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే !
పరువం వానగా .. నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో .. ఈడు తడిసేనులే

 

Read more

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే

నిరీక్షణ (1986)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం .. ఎన్నాళ్ళకు చేరం .. తీరందీ నేరం !

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే ..ఏడ బోయావే

తానాలే చేసాను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటీ నా కళ్ళలొ కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం .. ఇన్నేళ్ళకు వ్యర్ధం .. చట్టందే రాజ్యం !

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కలే తోచావే .. ఎన్నెల్లే కాచావే .. ఏడ బోయావే
Read more

కుశలమా .. నీకు కుశలమేనా

బలిపీఠం

సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల



కుశలమా .. నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా .. మరీ మరీ అడిగాను
అంతే .. అంతే .. అంతే


కుశలమా .. నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా .. ఎదో ఎదో వ్రాసాను
అంతే .. అంతే .. అంతే


చిన్న తల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటీ
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటీ


ఒకటేనా.. ఆ ఆ ..ఒకటేనా
హ హ ..ఎన్నైనా .. హాయ్ .. ఎన్నెన్నో


మనసునిలుపుకోలేకా .. మరీ మరీ అడిగానూ
అంతే .. అంతే .. అంతే


కుశలమా .. హాయ్ !

పెరటిలోని పూల పానుపు .. త్వరత్వరగా రమ్మందీ
పొగడనీడ పొదరిల్లూ.. దిగులు దిగులుగా ఉందీ


ఎన్ని కబురులంపేనో..ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా..నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఒకటైనా
అందెనులే .. తొందర తెలిసెను
Read more

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే

 తోటరాముడు (1975)
సంగీతం: సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: బాలు, పి.సుశీల

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !

ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !

పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ ..నీ కొసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే

నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే !

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !

సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే
కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే

ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే !

ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ !
Read more

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా

వాన (2008)


సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా


నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా !

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !


కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే


చిటపటలాడి..వెలసిన వానా
మెరుపుల దాడి..కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడీ !


ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !


ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా


మనసుని నీతో..పంపేస్తున్నా
నీ ప్రతి మలుపూ..తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి..నిన్ను చేరనా !


ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !


జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా !


ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !
Read more

ఎదుట నిలిచింది చూడు.. జలతారు వెన్నెలేమో

వాన (2008)


సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్



ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !


ఎదుట నిలిచింది చూడు..

నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ
అవునో..కాదో..అడగకంది నా మౌనం
చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా !


ఎదుట నిలిచింది చూడు..


నిన్నే చేరుకోలేక..ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా
నీదో..కాదో..రాసున్న చిరునామా
ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా !

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !
ఎదుట నిలిచింది చూడు..
Read more

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా

1940 లో ఒక గ్రామం

సంగీతం: సాకేత్ సాయిరాం
సాహిత్యం: శ్రీకాంత్ అప్పలరాజు
గానం: అనిల్ కుమార్

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా

ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా
ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా
ఏనాడైనా .. ఏ వేళైనా .. నాలోనా
ఏదేమైనా .. ఎవరేమైనా .. నీవేనే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !

ఈ వేళ ఎక్కడ ఉన్నావో .. ఏమేమి చేస్తూ ఉన్నావో
నాకేమో మదిలో నీ ధ్యాసే .. నీవేమో ఎపుడూ నా శ్వాసే
కాసంత కుదురే లేదాయే .. రేయంత నిదురే రాదాయే
నువు లేక కనులలో నీరేలే .. నువు రాక నిమిషం యుగమేలే
ఏ మాట విన్నా నీ పిలుపే .. యే చోట ఉన్నా నీ తలపే
విడలేను లే .. విడిపోనులే .. కడదాక నాతో నీవేలే

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా !!

నా కలల వెన్నెల నీవేనే .. నీ కనుల చీకటి కనలేనే
నా మనసు మాటే వినదేమో .. ఈ వలపు మాయే విడదేమో
నేనేమొ చేపగ మారానే .. నీవేమొ నీరై పోయావే
ఓ క్షణము విడి వడి పోయామా.. ప్రాణాలు విలవిల లాడేనే
నీ పేరు మరువను క్షణమైనా .. నీ ప్రేమ విడువను కలనైనా
కను మూసినా .. కను తెరచినా .. నగుమోమే పిలుచును ఏ వేళా

ఓ సీతాకోక చిలకా నీకై వేచా .. మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా .. ఎదనే పరిచా !!!
Read more

వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఏ మాయ చేసావే (2010) 

గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్


"పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !"

తరిమే వరమా..
తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..

ఏ .. మో .. ఏమో .. ఏమవుతుందో
ఏ ..దే..మైనా .. నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇంకపైనా .. వింటున్నావా ప్రియా !


గాలిలో తెల్లకాగితం లా .. నేనలా తేలియాడుతుంటే
నన్నే ఆపీ నువ్వే వ్రాసిన .. ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఆద్యంతం ఏదో అనుభూతీ
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిదీ
భూతలం కన్నా వెనుకటిదీ
కాలంతోనా పుట్టిందీ.. కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా !

రా ఇలా .. కౌగిళ్ళలో .. నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా..
ఎవరిని తలువని వేళలోనా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
Read more

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో

శ్రీదేవి (1970)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం: దాశరధి
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి


రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
ఊహూ ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
ఆ .. ఆ
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె .. దివిలోన తారకలాయె .. నీ నవ్వులే

అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణని నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

రాసాను ప్రేమలేఖలెన్నో .. దాచాను ఆశలన్ని నీలో
లా లా ల లాల లాల .. లా లా ల లాల లాల .. లా లా ల లా
Read more