Wednesday, December 3, 2014

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల

చిత్రం : తోడికోడళ్లు (1957)
రచన : ఆత్రేయ
దర్శకులు : ఆదుర్తి సుబ్బారావు 

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

నోట్ : ఈ పాట శరత్  బెంగాలి నవల “నిష్కృతి” ఆధారంగా  దుక్కిపాటి మధుసూదన రావు నిర్మించిన “తోడికోడళ్లు” సినిమా లోనిది.

0 comments:

Post a Comment