Thursday, October 23, 2014

చిరునవ్వుల వరమిస్తావా...

చిరునవ్వుల వరమిస్తావా    

పల్లవి:

    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను

    మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను
    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇదీ..ఈ..
    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇది
    వగలు నీవి.. సెగలు నావి.. మంచులోన మంట ఇదీ..ఈ..

చరణం 1:

    రేపు లేని రేయిని నేనై.. చెబుతున్నా వీడ్కోలు
    అశ్రువులే అక్షరాలుగా.. చేస్తున్నా చేవ్రాలు
    నిప్పు చివర నివురుంటుంది.. వలపు చివర వధుపుంటుంది

    నింగిజార్చు కన్నీటీ ధారలో.. నేల తడిసి పులకిస్తుంది
    ఆహ్..ఆహ్..

    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను
    మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను

చరణం 2:

    ఊహలన్ని శిధిలాలైతే.. ఊపిరున్న శిల నేను
    కళ్ళు లేని మనసున మరిగి.. కరుగుతున్న కల నేను
    పగులుతున్న హృదయమిది.. పడమటింటి ఉదయమిది
    పగులుతున్న హృదయమిది.. పడమటింటి ఉదయమిది
    ఎద ప్రమిదకు నెత్తురు నింపి.. ఎదురు చూచు దీపమిది
    ఆహ్..ఆహ్..

    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను
    మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను

    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇదీ..ఈ..
    పగలు నీవు రేయిని నేను.. కలుసుకోని జంట ఇది
    వగలు నీవి.. సెగలు నావి.. మంచులోన మంట ఇదీ..ఈ..

    చిరునవ్వుల వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను
    మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను

చిత్రం:     చిరునవ్వుల వరమిస్తావా (2005)
సంగీతం:     విద్యాసాగర్
గీతరచయిత:     వెన్నెలకంటి
నేపధ్య గానం:     బాలు

0 comments:

Post a Comment