skip to main |
skip to sidebar
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
చరణం 1 :
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 2 :
పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను.....
గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 3 :
నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
Read more
VIDEO
చిత్రం: దీక్ష సాహిత్యం: సి.నారాయణరెడ్డి సంగీతం: పెండ్యాల గానం: బాలు మెరిసే మేఘమాలిక ఉరుములు చాలుచాలిక చెలితో మాటలాడనీ వలపే పాట పాడనీ...వలపే పాట పాడనీ!! కమలాలే నా రమణి నయనాలై విరిసే అద్దాలే నా చెలియ చెక్కిళ్లై మెరిసే ఆ నయనాల కమలాలలోనా నా జిలుగు కలలు చూసుకోనీ ఆ అద్ధాల చెక్కిళ్ళలోనా నా ముద్దులే దాచుకోనీ!! మధుమాసం చెలిమోవిని దరహాసం చేసే చెలి జాబిలి చెలిమోమున కలలారబోసే ఆ దరహాస కిరణాలలోనా నను కలకాలం కరిగిపోనీ ఆ కలల పండు వెన్నెలలోనా నా వలపులన్ని వెలిగిపోనీ!!
http://www.youtube.com/watch?feature=player_embedded&v=v5TKxd4821k
Read more